NTV Telugu Site icon

హన్సిక సింగిల్ షాట్ చిత్రం ‘105 మినిట్స్’

హన్సిక ఇప్పుడు ప్రయోగాల బాట పట్టింది. తొలి సారి ప్రయోగాత్మకంగా ‘105 మినిట్స్’ పేరుతో ఓ సినిమా చేయబోతోంది. రుద్రాన్ష్ సెల్యూలాయిడ్ పతాకం పై బొమ్మక్ శివ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం ఒకే ఒక్క క్యారెక్టర్ తో తెరకెక్కుతుండటం విశేషం అయితే… ఎడిటింగ్ అనేది లేకుండా సింగిల్ షాట్ గా ఈ ‘105 మినిట్స్’ ని తీస్తున్నారట. రీల్ టైమ్ ఈ సినిమా రియల్ టైమ్ కావటం ఓ హైలైట్ అంటున్నారు చిత్ర దర్శకుడు రాజు దుస్సా. తన కెరీర్ లో ఇదొక మైలురాయి గా నిలిచే చిత్రమని హన్సిక భావిస్తోంది.ఈ సినిమా మేకింగ్ ని ఛాలెంజ్ గా తీసుకుని చేస్తున్నామంటున్నారు సినిమాటోగ్రాఫర్ దుర్గా కిషోర్.