నూతన గ్రామ పంచాయతీల్లో ఇంకా ఫిషింగ్ రైట్స్ వివాదం పరిష్కారం కాలేదు. పంచాయతీరాజ్, మత్స్యశాఖ అధికారులతో ఒక దఫా సమావేశం నిర్వహించిన సీఎస్… చీఫ్ సెక్రటరీకి కరోనా ఉన్నందున తదుపరి సమావేశాలు నిర్వహించలేకపోయారు. గతంలో టీఎస్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన పంచాయతీరాజ్ శాఖకు ఇరు శాఖల అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అందుకు రెండు వారాల సమయం కూడా ఇచ్చింది హైకోర్టు. కానీ మరో మూడు వారాలు గడువు పొడించాలని ప్రభుత్వం కోరింది. అయితే రేపు హైకోర్టులో ఈ పిటిషన్లు విచారణకు రానున్నాయి.