NTV Telugu Site icon

టిక్‌టాక్‌ భార్గవ్‌ కేసు పై దిశ ఎసిపి వివరణ…

బాలికను మాయమాటలతో లోబరుచుకుని గర్భవతిని చేసిన కేసులో టిక్‌టాక్‌ భార్గవ్‌ ను అరెస్ట్ చేశాం. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశాం అని దిశ ఎసిపి ప్రేమకాజల్ తెలిపారు. ఈ నెల 16 న బాలిక తల్లి దండ్రులు ఫిర్యాదు చేశారు. భార్గవ్ అరెస్ట్ మూడో తేదీ వరకూ రిమాండ్‌ లో ఉంటాడు. భార్గవ్‌ ఫన్‌ బాస్కెట్‌ పేరుతో టిక్‌టాక్‌ వీడియోలు చేసేవాడు. టిక్‌టాక్‌ నిషేధానికి గురికావడంతో మోజో, రెపోసో వంటి యాప్‌లలో ప్రస్తుతం వీడియోలు చేస్తున్నాడు. అయితే టిక్ టాక్ లో ఇతర మీడియాలో అవకాశాలు ఇప్పస్తానని 14 ఏళ్ళ మైనర్ బాలిక ను లైంగికంగా వాడుకున్నాడు. ఆ మైనర్ బాలికను ప్రేమిస్తున్నానని  భార్గవ్ వెంటపడ్డాడు. నో చెప్పిన వినకుండా దుస్తులు మార్చుకుంటున్నప్పుడు పోటోలు తీసి ఉన్నాయంటు బెదిరించి లోబరుచుకున్నాడు. ప్రస్తుతం భార్గవ్ కారు, ఫోన్ స్వాదినం చేసుకున్నాము. సోషల్ మీడియాలో ఇలా పాపులర్ చేస్తామంటే నమ్మకండి  ఎవరైన ఆ మైనర్ బాలిక ఎవరు ఎక్కడ ఉంటుంది ఎం చేస్తుంది అంటు వివరాలు కోసం సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాము అని పేర్కొన్నారు.