NTV Telugu Site icon

‘ది గ్రే మ్యాన్’ షూటింగ్ లో ధనుష్…!

Dhanush shooting for Netflix’s The Gray Man at California

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం కాలిఫోర్నియాలో ఉన్నారు. ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానున్న మూవీ ‘ది గ్రే మ్యాన్’ సినిమాలో ధనుష్ ఓ కీలక యాత్రలో నటిస్తున్నారు. ఈ యాక్షన్ డ్రామా షూటింగ్ నిమిత్తమై ‘ది గ్రే మ్యాన్’ మూవీ టీంతో కాలిఫోర్నియాలో ఉన్నారు ధనుష్. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ధనుష్ పోస్ట్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఈ యాక్షన్-డ్రామా చిత్రం 2009లో మార్క్ గ్రీనీ రాసిన ‘ది గ్రే మ్యాన్’ నవల ఆధారంగా రూపొందించబడుతోంది. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ లో ర్యాన్ గోస్లింగ్, క్రిస్ ఎవాన్స్, అనా డి అర్మాస్ , ధనుష్, వాగ్నోర్ మొయిరా, జెస్సికా హెన్విక్, జూలియా బట్టర్స్ తదితరులు నటిస్తున్నారు. ఆంథోనీ రస్సో, జో రస్సో ద్వయం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ధనుష్ ఇటీవలే ‘కర్ణన్’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు. ‘కర్ణన్’ దర్శకుడు మారి సెల్వరాజ్ దర్శకత్వంలో మరో సినిమా చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ధనుష్‌. ఇక ధనుష్‌ నటించిన ‘జగమేతంతిరమ్’ విడుదలకు సిద్ధం అయింది. ధనుష్‌ నటిస్తున్న బాలీవుడ్ సినిమా ‘ఆత్రంగి రే’ షూటింగ్ పూర్తి చేసుకుంది. కార్తీక్ నరేన్ సినిమాతో పాటు హాలీవుడ్ సినిమా ‘ది గ్రే మ్యాన్’ షూటింగ్ జరుపుకుంటున్నాయి.