‘ది గ్రే మ్యాన్’ షూటింగ్ లో ధనుష్…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం కాలిఫోర్నియాలో ఉన్నారు. ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానున్న మూవీ ‘ది గ్రే మ్యాన్’ సినిమాలో ధనుష్ ఓ కీలక యాత్రలో నటిస్తున్నారు. ఈ యాక్షన్ డ్రామా షూటింగ్ నిమిత్తమై ‘ది గ్రే మ్యాన్’ మూవీ టీంతో కాలిఫోర్నియాలో ఉన్నారు ధనుష్. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ధనుష్ పోస్ట్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఈ యాక్షన్-డ్రామా చిత్రం 2009లో మార్క్ గ్రీనీ రాసిన ‘ది గ్రే మ్యాన్’ నవల ఆధారంగా రూపొందించబడుతోంది. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ లో ర్యాన్ గోస్లింగ్, క్రిస్ ఎవాన్స్, అనా డి అర్మాస్ , ధనుష్, వాగ్నోర్ మొయిరా, జెస్సికా హెన్విక్, జూలియా బట్టర్స్ తదితరులు నటిస్తున్నారు. ఆంథోనీ రస్సో, జో రస్సో ద్వయం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ధనుష్ ఇటీవలే ‘కర్ణన్’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు. ‘కర్ణన్’ దర్శకుడు మారి సెల్వరాజ్ దర్శకత్వంలో మరో సినిమా చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ధనుష్. ఇక ధనుష్ నటించిన ‘జగమేతంతిరమ్’ విడుదలకు సిద్ధం అయింది. ధనుష్ నటిస్తున్న బాలీవుడ్ సినిమా ‘ఆత్రంగి రే’ షూటింగ్ పూర్తి చేసుకుంది. కార్తీక్ నరేన్ సినిమాతో పాటు హాలీవుడ్ సినిమా ‘ది గ్రే మ్యాన్’ షూటింగ్ జరుపుకుంటున్నాయి.
Also Read
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
- Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Tags
- Dhanush
- The Gray Man
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!