టాలెంటెడ్ టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తన తరువాత ప్రాజెక్ట్ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో ఉండబోతోందని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్ట్ విషయమై ధనుష్ ఆసక్తికరంగా స్పందించారు. “నేను ఆరాధించే దర్శకులలో ఒకరు శేఖర్ కమ్ములతో కలిసి పని చేయడం ఎగ్జైటింగ్ గా ఉంది. నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు లతో చేతులు కలపడానికి కూడా సంతోషిస్తున్నాను. వి.ఎస్.వి.సి.ఎల్.ఎల్.పి. బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ త్రిభాషా చిత్రం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు ధనుష్.
Also Read : ధనుష్, శేఖర్ కమ్ముల సినిమాలో రౌడీ బేబీ ?
కొత్త తరహా సినిమాలు చేస్తూ అటు ఆడియెన్స్ ను ఇటు జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న శేఖర్ కమ్ముల, ధనుష్ కలయికలో సినిమా అనేసరికి అప్పుడే అంచనాలు పెరిగిపోయాయి. తెలుగు, తమిళ, హిందీలో త్రిభాషా చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఎస్వీసీఎల్ఎల్ పీ పతాకంపై నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు, శేఖర్ కమ్ముల, ధనుష్ చిత్రాన్ని నిర్మించనున్నారు. ధనుష్ తెలుగులో నటిస్తున్న తొలి స్ట్రైయిట్ మూవీ ఇదే కావడం విశేషం. కాగా ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించనుంది అని వార్తలు విన్పిస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంతుందో చూడాలి.
