గత కొద్ది రోజులుగా బీహార్ మరియు యూపీ రాష్ట్రాల్లో గంగా నదిలో పదుల సంఖ్యలో కరోనా శవాలు తేలియాడుతూ కనిపించడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. కనీసం అంత్యక్రియలు నిర్వహించకుండా శవాలను గంగా నదిలో వదిలేస్తున్నారంటూ తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. అయితే దీనిపై తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై పరోక్ష విమర్శలు చేశారు. గంగానది తనను పిలుస్తోందని నాడు వ్యాఖ్యలు చేసిన వారే.. ఇప్పుడు ఆ నది విలపించేలా చేస్తున్నారని రాహుల్ పేర్కొన్నారు. 1,140 కిలోమీటర్ల గంగానది తీర ప్రాంతంలో ఇప్పటివరకు 2000లకు పైగా శవాలను గుర్తించినట్లు పేర్కొన్న ఓ వార్తను తన ట్వీట్‌కు రాహుల్ జోడించారు.
గంగానదిలో శవాలపై రాహుల్ గాంధీ ఫైర్
