దళిత బంధు పైలెట్ ప్రాజెక్టుపై అధికారులతో సమీక్ష జరిగింది. ఒక్కో దళిత కుటుంబానికి 10 లక్షలు ఇవ్వడం జరుగుతుంది అని సీఎస్ సోమేశ్ కుమార్ అన్నారు. బ్యాంకు లింక్ ఉండదు కుటుంబ బ్యాంకు ఎకౌంటు నెంబర్ కు డైరెక్ట్ గా పడతాయి. గ్రామస్థాయి నుండి స్టేట్ వరకూ కమిటీ ఏర్పాటు జరుగుతుంది. దళితుల బంధు స్కిమ్ కోసం ఎవరు డౌట్స్ పడాల్సిన అవసరం లేదు ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే వెంటనే అమలుకు చర్యలు తీసుకుంటాము. ఈనెల 16 న కేసీఆర్ దళిత బంధు పథకము కింద 15 మంది లబ్ధిదారులకు చెక్కుల అందజేత జరుగుతుంది. ప్రతివార్డు లో ప్రతి గ్రామంలో గ్రామ సభ ద్వారా లిస్ట్ ప్రిపేర్ జరుగుతుంది అని తెలిపారు.
ఇక షెడ్యూల్ క్యాస్ట్ కమీషనర్ రాహుల్ బొజ్జా మాట్లాడుతూ… హుజురాబాద్ లో పైలెట్ ప్రాజెక్టుగా దళిత బంధు సాగుతుంది. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా ప్రతి గ్రామంలో ప్రతి వాడలా దళిత బంధు అర్హులని అధికారులు గుర్తిస్తున్నారు. గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి గ్రామాల్లో నియమించబడ్డ కోర్దినేటర్స్ స్థానిక ప్రజా ప్రతినిధులు ఆధ్వర్యంలో లబ్ధిదారుల పేర్లు తెలుపుతాము. కొంత మంది స్పెషల్ ఆఫీసర్లతో దళిత వాడల్లో సర్వే చేపించి అనంతరం అర్హుల ఎంపిక ఉంటుంది. డబ్బు నేరుగా లబ్ధిదారుల వారికి చేరేలా డిజైన్ జరిగింది. దళిత అభివృద్ధి కొరకు దళిత రక్షణ నిధి ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.