భోపాల్ లోని ఓ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. మేల్ నర్సు చేతిలో అత్యాచారానికి గురైన 43 ఏళ్ల మహిళ ఆ తర్వాత 24 గంటల్లోనే ఓ మహిళా మృతి చెందింది. అయితే ఏం జరిగిందంటే… ఓ 43 ఏళ్ల మహిళ కరోనాతో బాధపడుతూ ఏప్రిల్ 6న భోపాల్ మెమోరియల్ ఆస్పత్రి అండ్ రీసెర్చ్ సెంటర్ లో చేరింది. ఆ సమయంలోనే తనపై మెల్ నర్సు అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదు చేసింది. అయితే అప్పటికే మహిళా పరిస్థితి విషమించడంతో ఆమెను వెంటీలేటర్ పైన ఉంచారు. వైద్యం పొందుతూ తాజాగా ఆమె మృతి చెందింది. మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పొలీసులు నిందితున్ని 40 ఏళ్ల సంతోష్ అహిర్ వార్ గా గుర్తించారు. వెంటనే అతన్ని అరెస్ట్ చేసిన పొలీసులు భోపాల్ సెంట్రల్ జైలుకు తరలించారు.