కరోనా దెబ్బకు ఇంద్రకీలాద్రిపై పడిపోయిన భక్తుల సంఖ్య 1000 కి పడిపోయింది. అయితే ఇంద్రకీలాద్రిపై తాజాగా కోవిడ్ బాధితుల సంఖ్య 52కు చేరుకుంది. అక్కడ కోవిడ్‌తో జమలమ్మ అనే అటెండర్ మృతి చెందింది. జమలమ్మ మృతితో ఇంద్రకీలాద్రి పై మృతుల సంఖ్య మూడుకు చేరింది. ఇక సోమవారం అక్కడ ఇద్దరు అర్చకులకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. రెండు రోజుల క్రితం కోవిడ్‌తో అర్చకుడు మృతి చెందగా.. మరొక అర్చకుని పరిస్ధితి విషమంగా మారింది. దాంతో ఇంద్రకీలాద్రిపై కఠిన ఆంక్షలు విధించారు. దర్శన వేళలను అధికారులు కుదించారు. ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు మాత్రమే దుర్గమ్మ దర్శనానికి అనుమతి ఇస్తున్నారు.