NTV Telugu Site icon

శ్రీవారి ఆలయ దర్శనాల పై లాక్ డౌన్ ఎఫెక్ట్…

తిరుమల శ్రీవారి ఆలయ దర్శనాల పై లాక్ డౌన్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. గణనీయంగా తగ్గుముఖం పడుతుంది భక్తులు సంఖ్య. గతంలో రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్నారు లక్షా ఐదు వేల మంది భక్తులు. కానీ ప్రస్తుతం  భక్తులు సంఖ్య  5 వేలు కూడా దాటడం లేదు. నిన్నటి రోజున స్వామివారిని అత్యల్పంగా 2262 మంది భక్తులు
దర్శించుకున్నారు. మూడున్నర లక్షల లడ్డు ప్రసాదాల విక్రయాల నుంచి 10 వేలకు పడిపోయింది లడ్డు ప్రసాదం విక్రయాలు. లక్షమందికి పైగా అన్నప్రసాద సౌకర్యం కల్పించే అన్నప్రసాదం సముదాయంలో ….ప్రస్తుతం భక్తుల భోజనాలు పది వేలు కూడా మించడం లేదు.