కోవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్ పై సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ… దేశంలో 45 ఏళ్లకు పైబడిన వారు 26 కోట్లు ఉన్నారు. వారికి నాలుగు వారాల వ్యవధిలో రెండో రెండో డోస్ ఇవ్వాలి. ఆ మేరకు మొత్తం 52 కోట్ల వాక్సిన్లు కావాలి. తొలి డోస్ ఇప్పటి వరకు కేవలం 12 కోట్ల మందికి మాత్రమే వేశారు. 2.60 కోట్ల మందికి ఇప్పటి వరకు రెండో డోస్ మాత్రమే వేశారు. మొత్తం కలిపి చూసినా ఇప్పటి వరకు వేసిన కోవిడ్ వాక్సిన్ డోస్‌లు దాదాపు 15 కోట్లు మాత్రమే. అంటే ఇంకా 39 కోట్ల వాక్సిన్ డోస్‌లు కావాలి. భారత్ బయోటెక్ నెలకు కోటి వాక్సిన్లు తయారు చేస్తుండగా, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ 6 కోట్ల వాక్సీన్లు తయారు చేస్తోంది. వీటితో పాటు రెడ్డీ ల్యాబ్స్.. ఇతర సంస్థల ఉత్పత్తులు రావడానికి ఇంకా కొన్ని నెలల సమయం పడుతుంది. అన్నీ కలిపి ఆగస్టు నాటికి కొత్తగా 20 కోట్లు వాక్సీన్లు ఉత్పత్తి కావొచ్చు. దానికి తోడు ఇప్పుడున్న 7 కోట్లు కూడా కలుస్తాయి. ఈ లెక్కన 39 కోట్ల వాక్సీన్ డిమాండ్ ఆగస్టు లేదా సెప్టెంబరు నాటికి కానీ పూర్తి కాదు అని తెలిపారు.
రాష్ట్రంలో వ్యాక్సినేషన్ పై సీఎం జగన్ విశ్లేషణ…
