బయోబాబులో చాలా జాగ్రత్తగా జరుగుతున్న ఐపీఎల్ 2021 లో ఈరోజు కరోనా కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు మొదట కోల్‌కత నైట్ రైడర్స్ జట్టులో వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కరోనా బారిన పడినట్లు తెలిసింది. అలాగే ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ, సీఈవో కాశీ విశ్వనాథన్, చెన్నై టీమ్ బస్ క్లీనర్ కరోనా వైరస్ బారిన పడినట్లు వార్తలు వచ్చాయి. కానీ వారికి కరోనా లేదు అని ఓ బీసీసీఐ అధికారి క్లారిటీ ఇచ్చారు. అయితే మొదట ఆదివారం చేసిన కరోనా పరీక్షలో ఈ ముగ్గురికి కరోనా పాజిటివ్ గా తెలగా ఈరోజు చేసిన పరీక్షలో వారికి నెగెటివ్ అని వచ్చింది. దాంతో మొదట వచ్చినవి తప్పుడు రిపోర్ట్స్ అని… కాబట్టి ఆ జట్టులో ఎవరు కరోనా బడిన పడలేదని తెలిపారు ఆ బీసీసీఐ అధికారి.