కరోనా వ్యాప్తికి… బీజేపీ… ఎన్నికల కమిషన్ బాధ్యత వహించాలి అని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. ఆక్సిజన్ అందించడం లో కేంద్రం విఫలమైంది. నింద రాష్ట్రాల మీద మోపుతుంది. విజయం సాధిస్తే మోడీ … అపజయం అయితే రాష్ట్రాల బాధ్యత అన్నట్టు వ్యవహరిస్తుంది అని కేంద్రం అన్నారు. వ్యాక్సిన్ వేసేది రాష్ట్రం… కోటా మాత్రం కేంద్రంది అని చెప్పిన ఆయన తన రాజకీయ పక్షపాతం చూపించే పనిలో కేంద్రం ఉంది. కరోనా నివారణ కు అవసరమైన నిధులు రాష్ట్రాలకు ఇవ్వాలి అని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం మన దేశంలో రోజుకు 3 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నా విషయం తెలిసిందే.