NTV Telugu Site icon

సోనూసూద్ ఫౌండేషన్ కు అంధయువతి విరాళం

దేశవ్యాప్తంగా ఆపదలో ఉన్నవారికి సాయం చేస్తూ రియల్ హీరో అనిపించుకున్నారు సోనూసూద్. తన సోనూసూద్ ఫౌండేషన్ ద్వారా ఎక్కడ ఎవరు సాయం అంటే ఆక్కడ సోనూ వాలంటీర్లు వాలిపోయి సాయం చేస్తూ వస్తున్నారు. అయితే ఈ సోనూ ఫౌండేషన్ కి పలువురు దాతలు విరాళాలు ఇస్తూ వస్తున్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వరికుంటపాడుకి చెందిన అంధ యువతి బొడ్డు నాగలక్ష్మి సోనూ ఫౌండేషన్ కి 15వేలు విరాళంగా అందచేశారు. ఇదే విషయాన్ని ట్వీట్ చేసిన సోనూసూద్ తన దృష్టిలో నాగలక్ష్మి రిచెస్ట్ ఇండియన్ గా అభివర్ణించారు. అంతే కాదు ఒకరి బాధను చూడటానికి కంటిచూపు అవసరం లేదని నాగలక్ష్మి నిరూపించారని ప్రశంసించారు. తను విరాళం ఇచ్చిన 15 వేలు నాగలక్ష్మి ఐదు నెలల పెన్షన్ కావటం విశేషం.