NTV Telugu Site icon

ఆ విషయం పై బీజేపీ అధినాయకత్వం సీరియస్…

లింగోజిగూడ డివిజన్ ఏకగ్రీవం విషయంలో తెరాస ,కేటీఆర్ ని కలవడం పై బీజేపీ అధినాయకత్వం సీరియస్ అయినట్లు తెలుస్తుంది. వాస్తవాలు నిగ్గుతేల్చేందుకు నిజ నిర్దారణ కమిటీని వేసింది. ముగ్గురు సభ్యులతో బీజేపీ వేసిన ఈ  కమిటీ లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, బీజేపీ దళిత మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి ఉన్నారు. రెండు రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది బీజేపీ. రిపోర్ట్ తర్వాత ఒకరిద్దరు నేతల పై చర్యలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక తనను కలిసిన నేతలతో బండి సంజయ్ పై కేటీఆర్ కామెంట్స్ చేసినట్టు సమాచారం.