NTV Telugu Site icon

కరోనా పై ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు…

కరోనా పై ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు  కె. వెంకట్రామి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. కరోనా సెకండ్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతూ చాలా ప్రమాదకరంగా మారుతుంది. కరోనాతో సచివాలయంలో గత మూడు రోజుల్లో ముగ్గురు ఉద్యోగులు మరణించారు. సచివాలయ ఉద్యోగులు అందరూ భయాందోళనకు గురవుతున్నారు. చాలా ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ పరిస్థితుల్లో వర్క్ ఫ్రం హోం ఇస్తే ఉద్యోగులకు కొంత ఊరట కలుగుతుంది. కనీసం వారం పాటు అందరికీ వర్క్ ఫ్రం హోం ఇవ్వాలి. వారం తర్వాత 50 శాతం ఉద్యోగులకు రోటేషన్ పద్దతిలో వర్క్ ఫ్రం హోం  ఇవ్వాలి. సచివాలయానికి సందర్శకులను పూర్తిగా నిలిపి వేయాలి.  గతంలో మాదిరిగా సచివాలయాన్ని ప్రతిరోజూ శానిటైజ్ చేయాలి అని తెలిపారు.