Site icon NTV Telugu

ఆ కంపెనీ మూసేయాలని ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆదేశాలు…

తిరుపతిలో అమరరాజ బ్యాటరీ కంపెనీకి షాక్ ఇచ్చింది ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. పొల్యూషన్ నిబంధనలు పాటించని కారణంగా అమరాజ బ్యాటరీ కంపెనీలు మూసేయ్యాలని ఆదేశాలు జారీ చేసింది. ఏమరాన్ పేరుతో బ్యాటరీలు ఉత్పత్తి చేస్తున్న అమరరాజ కంపెనీ నుంచి వచ్చే లెడ్ వల్ల తీవ్రమైన జల కాలుష్యం జరుగుతొందని నోటీసులో పేర్కొంది పీసీబీ. చిత్తూరు, తిరుపతి కరకంబాడీ రెండు యూనిట్లు మూసేయ్యాలని ఆదేశించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్… ఈ రెండు ప్లాంట్లలో వచ్చే లెడ్ వల్ల భవిష్యతులో ఏలూరులో వింతజబ్బు వచ్చి పడిపోయినట్టుగా జనాలు ఇబ్బందులు పడతారని హెచ్చరించింది.  ప్రస్తుతం ఈ రెండు ప్లాంట్లలో పన్నెండు వేలకు పైగా ఉద్యోగులు ఉండగా ఏడాదికి పదివేల కోట్ల టర్నోవర్ తో నడుస్తుంది అమరరాజ కంపెనీ. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు చెందిన అమరరాజ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పీసీబీ నోటీసులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. 

Exit mobile version