NTV Telugu Site icon

సీఎస్‌, డిస్కంలు, ఇంధన శాఖకు ఏపీ ఈఆర్సీ లేఖ

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు, డిస్కంలకు, ఇంధన శాఖ సెక్రెటరీకి లేఖ రాసింది ఏపీ ఈఆర్సీ… ఏపీ డిస్కంలకు చెల్లించాల్సిన వేల కోట్ల సబ్సిడీ బకాయిల పెండింగ్ పై కాస్త ఘాటుగానే లేఖ రాసింది ఎలక్ట్రసిటీ రెగ్యులేటరీ కమిషన్.. అయితే రూ.25,257 కోట్ల బకాయిలపై ఈఆర్సీ రాసిన లేఖను బయటపెట్టారు పయ్యావుల కేశవ్.. ఈ నెల 9వ తేదీ ఏపీ ఈఆర్సీని కలిసి ఇంధన శాఖలో పరిస్థితులు, నిర్ణయాలపై ఈఆర్సీకి ఫిర్యాదు చేశారు పీఏసీ చైర్మన్ పయ్యావుల. ఈ నేపథ్యంలో.. ఏపీ ఈఆర్సీ లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Read Also: యువకుడిని కాపాడిన ఇన్‌‌స్పె‌క్టర్‌ రాజే‌శ్వరి.. అభినందించిన సీఎం..

ఇక, ఏపీ ఈఆర్సీ లేఖలో పేర్కొన్న అంశాల విషయానికి వస్తే.. ప్రభుత్వం నుంచి డిస్కంలకు రావాల్సిన రూ. 15474 కోట్ల సబ్సిడీ బకాయిలు వెంటనే చెల్లించాలని.. డిస్కంలకు చెల్లింపులు జరిపేలా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సూచించింది.. స్థానిక సంస్థలు, ఇతర ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సిన రూ.9,783 కోట్లను డిస్కంలు వసూలు చేయాలని పేర్కొంది. బకాయిల చెల్లింపులపై 14 రోజుల గడువుతో నోటీసులు ఇవ్వాలని సూచించిన ఈఆర్సీ.. ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థల నుంచి 14 రోజుల్లో స్పందన రాకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేయాలని ఆదేశించింది.. డిస్కంలు మనుగడే ప్రమాదంలో పడిందని లేఖలో పేర్కొంది ఏపీఈఆర్సీ.