NTV Telugu Site icon

ఏపీ కరోనా : 9వేలకు చేరువలో కేసులు…

ap corona

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజా కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 8,987 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,76,987 కు చేరింది. ఇందులో 9,15,626 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 53,889 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 35 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 7,472  మంది మృతి చెందారు. ఇకపోతే గడిచిన 24 గంటల్లో ఏపీలో 3,116 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు.ఇక ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 37,922 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.