NTV Telugu Site icon

ఏపీలో పెరిగిన కరోనా కేసులు…

ap corona

ఏపీలో క‌రోనా సెకండ్‌ వేవ్ క‌ల్లోల‌మే సృష్టిస్తోంది. అయితే ఈరోజు 20 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీ వైద్య ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం గ‌త 24 గంట‌ల్లో రాష్ట్రంలో 1,05,494 శాంపిల్స్ పరీక్షించగా 22,164 మందికి  కోవిడ్ పాజిటివ్ గా నిర్ధార‌ణ అయ్యింది. 24 గంట‌ల్లోనే కోవిడ్‌తో 93 మంది మృతి చెంద‌డం క‌ల‌క‌లం రేపుతోంది.  ఇదే స‌మ‌యంలో 12,749 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 12,87,603 కి చేర‌గా.. యాక్టివ్ కేసులు 1,90,632 గా ఉన్నాయి.. ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు 10,88,264 క‌రోనా నుంచి కోలుకోగా 8,707 మంది ప్రాణాలు కోల్పోయారు.