ఏపీలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలమే సృష్టిస్తోంది. అయితే ఈరోజు 10 లకు దిగువగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రంలో 74,041 శాంపిల్స్ పరీక్షించగా 9,881 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. 24 గంటల్లోనే కోవిడ్‌తో 48 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. ఇదే సమయంలో 4,431 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 10,43,441 కి చేరగా.. యాక్టివ్ కేసులు 95,131 గా ఉన్నాయి.. ఇక, ఇప్పటి వరకు 9,40,574 కరోనా నుంచి కోలుకోగా 7,736 మంది ప్రాణాలు కోల్పోయారు.