టాలీవుడ్ స్టార్ నాని ప్రస్తుతం నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘టక్ జగదీష్’. ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నాని సరసన రీతువర్మ నాయికగా నటించగా, జగపతిబాబు, ఐశ్వర్యా రాజేశ్, నాజర్, రోహిణి, దేవదర్శిని, నరేశ్, రావు రమేశ్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ‘నిన్నుకొరి’ తరువాత శివ నిర్వాణ, నాని కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ సినిమాను నిర్మించారు. ‘టక్ జగదీష్’కు థమన్ సంగీతం అందించారు. ఏప్రిల్ 23న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. సినిమా కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ‘ఇంకోసారి ఇంకోసారి’ అనే మెలోడీ సాంగ్ కు యూట్యూబ్ లో విశేషమైన ఆదరణ లభిస్తోంది. తాజాగా ఈ లిరికల్ వీడియో సాంగ్ 5 మిలియన్ వ్యూస్ క్రాస్ చేయడం విశేషం. శ్రేయ ఘోషల్, కాల భైరవ ఆలపించిన ఈ సాంగ్ కు చైతన్య ప్రసాద్ లిరిక్స్ అందించారు. కాగా రానా హోస్ట్ చేస్తున్న పాపులర్ షో ‘నెం.1 యారి’ షోలో ఈ ఆదివారం సాయంత్రం 4 గంటలకు ‘టక్ జగదీష్’ టీం సందడి చేయనుంది.
టక్ జగదీష్ : 5 మిలియన్ వ్యూస్ దాటిన ‘ఇంకోసారి ఇంకోసారి’ సాంగ్
