చెన్నై ఎయిర్‌పోర్ట్ లో భారీగా బంగారం పట్టుకున్నారు అధికారులు. దుబాయ్ నుండి చెన్నై వచ్చిన ఎయిర్ ఇండియా విమానం లో 3 కోట్ల విలువ చేసే 6 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. ఎయిర్ ఇండియా విమానం సీటు కింద ఓ కవర్ లో చుట్టిన 6 బంగారు బిస్కెట్ల ను గుర్తించారు ఎయిర్ లైన్స్ సిబ్బంది. విమానం క్లీన్ చేస్తుండగా బంగారం గుర్తించడంతో… ఆ బంగారాన్ని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. అయితే దీని పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కస్టమ్స్ అధికారులు… ఆ సీటు లో కూర్చున్న ప్రయాణీకుల కూపి లాగుతున్నారు.