కుటుంబాన్ని పోషించుకోవడానికి ఏ దారి లేనప్పుడు రోడ్డుపై చేయిచాచి భిక్షాటన చేసి దాతలు ఇచ్చిన డబ్బుతో జీవనం సాగిస్తుంటారు. అయితే, ఓ మహిళ భిక్షాటన చేస్తూ భారీగా సంపాదిస్తోంది. అంతేకాదు, రోజుకు ఎంత సంపాదిస్తున్నది అనే విషయాలను ఆమె తన డైరీలో రాసుకుంటున్నది. రోజుకు 1500 వరకు సంపాగిస్తున్నట్టు డైరీలో రాసుకున్నది. అంటే నెలకు సుమారు 40 వేలకు పైగా సంపాదన. క్రమం తప్పకుండా ఆ మహిళ రోజూ రోడ్డుపై చిన్నపిల్లవాడిని ఒడిలో కూర్చుబెట్టుకొని భిక్షాటన చేస్తున్నది. ఆమెకు సంబంధించిన ఫొటోలను, ఆమె డైరీని కొందరు ఫొటోలు తీసీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మలేషియాలోని సెరంబన్ ప్రాంతంలో సదరు మహిళ భిక్షాటన చేస్తున్నది. బాగా చదువుకొని ఉద్యోగం చేసే వ్యక్తులు కూడా ఈ స్థాయిలో సంపాదించడం లేదని కొంతమందని నెటిజన్లు వాపోతున్నారు.
Read: ఎలన్ మస్క్‌కు కొత్త చిక్కులు… ఆ ప్రాజెక్టుపై వెల్లువెత్తున్న విమర్శలు..
