తక్కువ సినిమాలతో స్టార్ హీరో కన్నా ఎక్కువ ఫాలోయింగ్ ను అందుకున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ .. యూత్ లో మంచి క్రేజ్ ను అందుకున్నాడు.. దాస్ కా ధమ్కీ సినిమాతో హిట్ కొట్టి ఫామ్ లో ఉన్నాడు మరో మూడు సినిమాలు కమిటయ్యి వరస షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు.. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే విశ్వక్ తన సినిమాల గురించి ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటాడు.. తాజాగా తాను సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద రచ్చగా మారింది..
ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో నటిస్తున్నాడు… కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తునారు. పిరియడ్ విలేజ్ పొలిటికల్ డ్రామాగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో నేహా శెట్టి, అంజలి ఫీమేల్ లీడ్స్ లో నటిస్తున్నారు. ఈ చిత్రం రిలీజ్ డేట్ విషయమై ఏం జరిగిందో ఏమో కానీ ట్విట్టర్ లో ఓ రేంజిలో ఫైర్ అయ్యాడు. బ్యాక్ గ్రౌండ్ లేకపోతే ప్రతీ నా కొడుకు మనగేమ్ మారుద్దాం అనుకుంటాడు.. డిసెంబర్ 8 న అనుకున్న ఇప్పుడు 29 న న్యూయర్ కానుకగా విడుదల చెయ్యనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..
ఇప్పుడు డిసెంబర్ లో కూడా రాకుండా ముందుకు వెళ్లబోతున్నట్లు వినపడుతోంది. డిసెంబర్ 8 న విశ్వక్సేన్ తన సినిమా రిలీజ్ కోరుకుంటున్నారు. దానికి తేడా కొడుతుందని గమనించే విశ్వక్ సేన్ …ఈ రేంజిలో ఫైర్ అయ్యారని తెలుస్తోంది. అయితే ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేసారని మాత్రం తెలియటం లేదు.. కానీ ఈ పోస్ట్ మాత్రం తెగ వైరల్ అవుతుంది.. గోదావరి జిలాల్లో జరిగే మాస్ యాక్షన్ డ్రామా అని తెలుస్తుంది. గోదావరిపై సినిమా, అది కూడా ఇలా మస్ యాక్షన్ లో తెలంగాణ కుర్రోడు అయిన విశ్వక్ ప్రకటించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గ్లింప్స్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.. ఈ సినిమాను శ్రీకర ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మిస్తున్నాయి..
#gog pic.twitter.com/4dHvcTDJ9y
— VishwakSen (@VishwakSenActor) October 29, 2023