Site icon NTV Telugu

Urvashi Rautela: ఏంటీ.. ఆ బల్లి నెక్లెస్ అన్ని కోట్లా.. ఒక పాన్ ఇండియా సినిమా తీయొచ్చు తెలుసా..?

Ravotolla

Ravotolla

76 వ కేన్స్ ఫిల్మ్‌ ఫెస్టివల్‌‌లో తన అందాలతో ప్రపంచాన్ని ఊర్వశి రౌతేలా ఆకర్షిస్తోంది. ఇందులో భాగంగా మే 16న ఆమె వేసుకున్న కాస్ట్యూమ్‌ నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు కామెంట్స్‌ చేశారు. ముఖ్యంగా ఆమె పెట్టుకున్న మొసలి నెక్లెస్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పింక్‌ కలర్‌ గౌనులో మెరిసిన ఊర్వశి.. మెడలో తనకెంతో ఇష్టమైన మొసలి నెక్లెస్‌, చెవులకు మొసలి రింగులు పెట్టుకుంది. ఆ తర్వాత దీనిపై నెట్టింట చర్చ జరిగింది.

Also Read : GT vs CSK: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకున్న గుజరాత్ టైటాన్స్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఫేక్ నెక్లెస్‌ పెట్టుకుని వెళ్లారా అని ఊర్వశి రౌతేలాను ప్రశ్నించారు. దీంతో ఆమె టీమ్‌ దీని ధరను ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టింది. ఊర్వశి ధరించిన నెక్లెస్‌ ఫేక్‌ కాదు.. దాని ధర రూ.200 కోట్ల దాకా ఉంటుందని వెల్లడించారు. దీని ధర చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఈ నెక్లెస్‌ను ఫ్రెంచ్ లగ్జరీ సంస్థ కార్టియర్ తయారు చేసింది.

Also Read : Director Teja: కొడుకు టాలీవుడ్ ఎంట్రీ.. అందం ఉంటే చాలదు అన్న తేజ

ఒరిజినల్ నెక్లెస్ అనేది కార్టియర్ బ్రాండ్ యొక్క అత్యుత్తమ కలెక్షన్ పురాతన ఆభరణాలలో భాగం. ఈ నెక్లెస్ మొదటిసారిగా 2018 సంవత్సరంలో పరిచయం చేయబడింది. ఈ నెక్లెస్‌లో కేవలం ఒక మొసలిని తయారు చేయడంలో వెయ్యికి పైగా కట్ ఫ్యాన్సీ పసుపు వజ్రాలు ఉపయోగించబడ్డాయి. ఇందులో 18 క్యారెట్ల పసుపు బంగారాన్ని కూడా ఉపయోగించారు. నెక్లెస్‌లో 60.02 క్యారెట్లు ఉపయోగించబడ్డాయి. ఫోర్బ్స్ ప్రకారం, రెండవ మొసలిలో 18 క్యారెట్ల తెల్ల బంగారాన్ని ఉపయోగించారు మరియు దానిపై 66.86 క్యారెట్ల బరువున్న పచ్చలు ఉంచబడ్డాయి. దీంతో ఈ నెక్ల్సెస్ ధర సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Exit mobile version