Site icon NTV Telugu

Travel Loan: జల్సాలకు లోన్ తీసుకుంటున్న యువత.. సర్వేలో సంచలన విషయాలు..!

Lone

Lone

ప్రస్తుతం ఏ బిజినేస్ అయిన యువత ఇష్టాలమీద, ఉద్యోగుల అవసరాల మీద ఆధారపడి ఉంటున్నాయి. మీకు తెలుసా ఇప్పుడు మార్కెట్‌లో నయా లోన్ ట్రెండింగ్‌లో ఉందని.. అసలు ఏంటా నయా లోన్, దానిపై ఒక లుక్ ఏద్దాం.. మనం తరచుగా హోమ్ లోన్, పర్సనల్ లోన్, కార్ లోన్ గురించి వింటూనే ఉంటాం. కానీ ఇప్పుడు మార్కెట్‌లో నయా ట్రెండ్ నడుస్తుంది. అది కూడా యువత ఇష్టాలకు అనుగుణంగా, ఉద్యోగుల అవసరాలను తీర్చే వెసులుబాటును కలిగి ఉన్నది కావడం విశేషం. దాని పేరే.. ట్రావెల్ లోన్, హాలిడే లోన్. ఈలోన్ వివరాలు, లాభాలను పరిశీలిద్దాం.

READ MORE: TMC vs BJP Tensions: బెంగాల్ బీజేపీ నేత సువేందు కాన్వాయ్‌పై దాడి.. తీవ్ర ఉద్రిక్తత!

పైసాబజార్ 2025లో చేసిన ఒక కన్‌జ్యూమర్ ఇన్సైట్స్ సర్వే ప్రకారం.. భారతీయులు ఇప్పుడు ఎక్కువగా సరదా ప్రయాణాలకు ఎక్కువగా అప్పులపై ఆధారపడుతున్నారని వెల్లడైంది. ఈ సర్వేలో పాల్గొన్నవారిలో 27 శాతం మంది హాలిడే ఖర్చులకు పర్సనల్ లోన్ తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ లోన్లలో ఎక్కువ మంది యంగ్ జనరేషన్‌ నుంచే వచ్చిన వారే ఉన్నారు. చాలా మంది యువత ఈ రోజుల్లో అందుబాటులో ఉన్న ట్రావెల్ ప్యాకేజీలు, సులభమైన ఫైనాన్స్ ఆప్షన్స్ చూసి హాలిడే కోసం లోన్ తీసుకోవాలనుకుంటున్నారు.

మీకు తెలుసా!
జెన్ జెడ్ అంటే 20 నుంచి 30 ఏళ్లలో ఉన్నవారు. వీరిలో 2023లో 14 శాతం మంది మాత్రమే హాలిడే కోసం లోన్ తీసుకోగా, అదే 2025లో ఇది 29 శాతానికి పెరిగింది. మిల్లెనియల్స్ అంటే 30 నుంచి 40 ఏళ్ల వయస్సు గలవారు. వీరు మాత్రం 47 శాతం షేర్‌తో ముందున్నారు. మనం గమనిస్తే లోన్ తీసుకునే మొత్తాల్లోనూ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. 2025లో 50 వేల కంటే తక్కువగా ఉన్న లోన్లు 2 శాతం నుంచి 15 శాతానికి పెరిగాయి. అంతే కాకుండా, 50 వేల నుంచి 1 లక్ష మధ్యలో ఉన్న లోన్లు 12 శాతం నుంచి 20 శాతానికి, రూ.1 లక్ష నుంచి రూ.3 లక్షల మధ్యలో ఉన్న లోన్లు మొత్తం హాలిడే లోన్లలో 30 శాతం చేరుకున్నాయి. ఇది 2023లో 13 శాతం మాత్రమే ఉంది.

ఎంత మందికి తెలుసు..
ఫైనాన్షియల్ అడ్వైజర్లు మాత్రం ఈ హాలిడే లోన్లపై నెగెటివ్‌గా ఉన్నారు. వాళ్లు ఏం చెప్తున్నారు అంటే.. ఇవి దీర్ఘకాలంలో కొన్ని ఆర్థిక సమస్యలకు కారణం అవుతాయని యువతకు సూచిస్తున్నారు. ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్నవారే ఈ హాలిడే లోన్లు ఎక్కువగా తీసుకుంటున్నారన్న విషయం ఎంత మందికి తెలుసు. స్టేబుల్ జీతాలు, క్రెడిట్ యాక్సెస్ ఉండడం వల్లే ఇది జరుగుతున్నట్లు సమాచారం. హాలిడే లోన్లు సాధారణంగా పర్సనల్ లోన్ల రూపంలో ఉంటాయి. వీటి వడ్డీ రేట్లు 10 శాతం నుంచి 20 శాతం వరకు ఉంటాయి. హాలిడే కోసం లోన్ తీసుకోవడం అనేది ఆర్థిక నియంత్రణని నెమ్మదిగా బలహీనంగా చేస్తుంది. దీని వల్ల భవిష్యత్తులో ఆర్థికంగా అస్థిరత వస్తే ఆశ్చర్యపోనవసరం లేదు.

READ MORE: MG Hector, Astor: ఎంజీ కళ్లు చెదిరే ఆఫర్స్.. ఆ మోడల్స్ పై రూ. 2.30 లక్షల డిస్కౌంట్

వీటిని ప్రయత్నించండి..
హాలిడేని లోన్ తీసుకోకుండానే సెట్ చేసుకోవచ్చని ఎంత మందికి తెలుసు. నెలకు చిన్న మొత్తం, ఉదాహరణకి రూ.10,000 పొదుపు చేస్తే, ఏడాది తర్వాత రూ.1.2 లక్షలు వచ్చేస్తాయి. ఈ డబ్బుతో డొమెస్టిక్ ట్రిప్ లేదా సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఇంటర్నేషనల్ ట్రిప్‌ కూడా వెళ్లొచ్చు. సీజన్ కాని టైంలో ట్రావెల్ చేస్తే ఖర్చు తక్కువగా ఉంటుంది. రెగ్యులర్ డిపాజిట్‌లు, మ్యూచువల్ ఫండ్ ఎస్‌ఐపీలు వంటివి ఇండియాలో అందుబాటులో ఉన్నాయి. వీటిలో పెట్టుబడి పెడితే లాభాలు కూడా వస్తాయి. చిన్నగా అయినా సొంత డబ్బుతో ప్లాన్ చేయడం ఉత్తమం. అంతా చూస్తే, హాలిడే కోసం అప్పు తీసుకోవడం తాత్కాలిక ఆనందం ఇచ్చినా, దీర్ఘకాలానికి తలనొప్పులు తెస్తుందనేది గుర్తించాలి.

Exit mobile version