శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ పుట్టినరోజు నేడు. జూన్ 15న ఆయన తన 46వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పెషల్ గా కొరటాలకు బర్త్ డే విషెస్ తెలియజేశారు. “స్నేహానికి విలువ ఇచ్చే వ్యక్తిత్వం అరుదు. అటువంటి అరుదైన స్నేహితుడు, సన్నిహితుడు అయిన కొరటాల శివ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు” అంటూ ట్వీట్ చేశారు. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో “జనతా గ్యారేజ్” తెరకెక్కగా… ఇప్పుడు “ఎన్టీఆర్30” రూపొందనుంది. ఇక కొరటాలతో ఉన్న పిక్ ను షేర్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. కొరటాల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న “ఆచార్య”లో చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇంకా సాయి ధరమ్ తేజ్, బండ్ల గణేష్, బ్రహ్మాజీ, బాబీ వంటి ప్రముఖులు కూడా కొరటాలకు బర్త్ డే విషెస్ చేస్తూ ట్వీట్లు చేశారు.
కొరటాలకు ప్రముఖుల బర్త్ డే విషెస్
