Site icon NTV Telugu

ఆ స‌ముద్రం ఒడ్డున వేలాది సాండ్ డాల‌ర్లు… ఎలా వ‌చ్చాయంటే…

అమెరికాలోని అనేక బీచ్ ఒడ్డున వేలాది సాండ్ డాల‌ర్లు కొట్టుకు వ‌స్తున్నాయి.  ఇలా బీచ్‌ల‌కు కొట్టుకొస్తున్న సాండ్ డాల‌ర్లు నీరు వెన‌క్కి వెళ్లిపోగానే మృతి చెందుతున్నాయి.  ఒక‌టి కాదు రెండు కాదు ఇటీవ‌ల కాలంలో వేల సంఖ్య‌లో ఇలా సాండ్ డాల‌ర్లు కొట్టుకు వ‌స్తుండ‌టంతో ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌లు ఆందోళ‌న చెందుతున్నారు. స‌ముద్రంలోని నీరు వేడిగా ఉండే ప్రాంతాల్లో ఇవి నివ‌శిస్తుంటాయి. అయితే, స‌ముద్రంలోని వాతార‌వ‌ణంలో వ‌స్తున్న మార్పుల కార‌ణంగా ఇవి ఒడ్డుకు కొట్టుకు వ‌స్తున్నాయ‌ని ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌లు ఆందోళ‌న చెందుతున్నారు.  ఒడ్డుకు కొట్టుకు వ‌చ్చిన నిమిషాల వ్య‌వ‌ధిలోనే వీటీ శ‌రీరంపైన ఉన్న నీరు ఆవిరైపోతుంది.  ఫ‌లితంగా అవి మ‌ర‌ణిస్తుంటాయి.  అయితే, కొన ఊపిరితో ఉండే వాటిని ప‌ట్టుకొని స‌ముద్రంలో వ‌దిలివేయాల‌ని, ఇంటికి తీసుకెళ్ల‌వ‌ద్ద‌ని సీసైడ్ అక్వేరియం సంస్థ చెబుతున్నది.  

Read:

Exit mobile version