NTV Telugu Site icon

Viral Video : రీల్స్ కోసం వెర్రి చేష్టలు చేసిన యువకుడు.. వీడియో పై క్లారిటీ ఇచ్చిన సజ్జనార్..

Viral

Viral

Viral Video : యువత సోషల్ మీడియాలో పేరు తెచ్చుకోవడానికి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. ముఖ్యంగా రీల్స్ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టే యువతీయువకులు చూస్తున్నాము. ఇక తాజగా వైరల్ గా మారిన వీడియోలో హైదరాబాద్‌లో ఓ యువకుడు రీల్స్ కోసం నడిరోడ్డు పై వెళుతున్న బస్సు కింద ఒక్కసారిగా పడుకున్నాడు. నగరంలోని సిటీ బస్సు రాగానే ఎదురెళ్లిన ఆ యువకుడు ఒక్కసారిగా రోడ్డుపై పడుకున్నాడు. అయితే అతను పడుకుని ఉండడంతో బస్సు అతని మీద నుంచి వెళ్ళిపోయింది. బస్సు అతని మీద నుంచి వెళ్లగానే లేచి పక్కకు వెళ్ళిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వీడియో సోషల్ నెట్‌వర్క్‌ లలో వైరల్ గా మారింది.

Nara Bhuvaneswari: అసెంబ్లీకి సీఎం చంద్రబాబు.. నారా భువనేశ్వరి ఆసక్తికర ట్వీట్

ఇక ఈ వీడియో హైదరాబాద్ నగరంలో జరిగినట్లుగా కనబడుతుండగా దీనిపై తాజాగా తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనర్ స్పందించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ఫేక్ అని., ఇది పూర్తిగా ఎడిట్ చేసిన వీడియో ఉంటూ ఆయన చెప్పుకోచ్చారు. సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి కొందరు అతిగా ఆలోచించి ఇలా వీడియోలను ఎడిట్ చేసి వదులుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇలాంటి వెకిలి చేష్టలు చేయడం వల్ల ఆర్టీసీ ప్రతిష్ట దెబ్బ తీసే ప్రయత్నం చేయడం మంచిది కాదంటూ ఆయన పేర్కొన్నారు.

TG Cabinet : రైతులకు గుడ్‌ న్యూస్‌.. పంట రుణాల మాఫీకి గ్రీన్‌ సిగ్నల్‌

ఇలాంటి వీడియోల వల్ల లైకులు, కామెంట్లు కోసం చేసే ఈ తరహా అనాలోచిత పనులను ఇతరులను అనుకరించే ప్రమాదం పొంచి ఉంది కాబట్టి ఇలాంటివి చేయకూడదని ఆయన తెలిపారు. ముఖ్యంగా ఇలాంటి సంఘటనలను సరదా కోసం ఎడిట్ వీడియోలు ఇతరులకు ప్రాణాపాయం కూడా కలిగిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలపై తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం సీరియస్ గా యాక్షన్ తీసుకుంటుందని., ఇలాంటి వీడియోలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.