NTV Telugu Site icon

Telangana : బిగ్ బ్రేకింగ్.. విద్యాసంస్థల సెలవు పొడిగింపు..

Schools

Schools

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. గత రెండు రోజులుగా వర్షాలు తగ్గడంలేదు.. బుధవారం రాత్రి నుంచి వర్షం పడుతూనే ఉంది.. ఈ మేరకు తెలంగాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుంది.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నభారీ వర్షాల దృష్ట్యా తెలంగాణాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇప్పటికి వర్షం తగ్గక పోవడంతో శుక్రవారం, 27 జులై కూడా సెలవు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం..

వర్షాలపై సమీక్షించ నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం సెలవు ప్రకటించాలని, అందుకు సంబంధించి తక్షణమే ఉత్వర్వులు జారీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఇప్పటికే వర్షాల నేపథ్యంలో బుధ, గురువారాల్లో స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ఇచ్చింది. అయితే కురుస్తున్న వర్షాలు.. మరో రెండు, మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయనే వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో సెలవును పొడిగించాలని నిర్ణయించింది. ఈ నెల 29న (శనివారం) మొహర్రం సందర్భంగా విద్యాసంస్థలకు సెలవు ఉంది. ఆ తర్వాత రోజు ఆదివారం.. దాంతో ఇక సోమవారం బడులు ఓపెన్ కానున్నాయని తెలుస్తుంది..

వర్షాల మూలంగా వారం రోజులుగా సెలవులు ప్రకటించడంతో వీటి ప్రభావం పరీక్షల నిర్వహణపై పడుతోంది. వర్షాలు తగ్గి, సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు పరీక్షలన్నింటినీ వాయిదా వేయాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు వర్సిటీలు, విద్యా సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇప్పటికే ఓయూ, జేఎన్టీయూ, తెలుగు యూనివర్సిటీల్లో ఇంటర్నల్‌ పరీక్షలతోపాటు ఎంట్రన్స్‌ టెస్ట్‌లు సైతం వాయిదా పడ్డాయి. డిగ్రీ ప్రవేశాల తేదీల్లోనూ మార్పులు చేశారు. దీంతో డిగ్రీ, ఇంజనీరింగ్‌ పరీక్షలు మరింత ఆలస్యం కానున్నాయి..పాఠశాలల్లో జూలైలో జరగాల్సిన ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎఫ్‌ఏ-1) పరీక్షలనూ వాయిదా వేయాలని అధికారులు భావిస్తున్నారు.. వర్షాలు కారణంగా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు..