Site icon NTV Telugu

30 నిమిషాల్లోనే 134 రకాల వంటలు… తమిళనాడు మహిళ రికార్డ్‌…

సాధారణంగా ఒక కుటుంబానికి స‌రిప‌డా వంట చేయ‌డానికి క‌నీసం గంట నుంచి గంట‌న్న‌ర స‌మ‌యం ప‌డుదుంది.  ఇక‌, పండ‌గ‌లు, ప‌ర్వ‌దినాల‌కు వంట చేయాలంటే క‌నీసం మూడు గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది.  అయితే, త‌మిళ‌నాడులోని మ‌ధురై జిల్లాకు చెందిన ఇందిరా ర‌విచంద్ర‌న్ అత్యంత వేగంగా 30 నిమిషాల్లోనే 134 ర‌కాల వంట‌లు చేసి రికార్డ్ సృష్టించింది.  ఇందులో ఇడ్లీ, దోశల‌తో పాటు అనేక ర‌కాల వెజ్‌, నాన్ వెజ్ వంట‌కాలు ఉన్నాయి.  త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ ర‌కాల వంట‌లు చేసిన ఇందిరా ర‌విచంద్ర‌న్ పేరును ఇండియా రికార్డ్‌లో న‌మోదు చేశారు.  చిన్న‌త‌నం నుంచే వంట‌ల‌పై ఆస‌క్తి ఉండ‌డంతో ఈ రికార్డు సాధ్య‌మైన‌ట్టు ఇందిరా ర‌విచంద్ర‌న్ పేర్కొన్నారు.  

Read: కాబూల్‌లో ఉక్రెయిన్ విమానం హైజాక్‌…

Exit mobile version