NTV Telugu Site icon

Swathi-Saidharam Tej: మెగాహీరోకి స్టేజీపై ముద్దుపెట్టిన కలర్స్ స్వాతి.. వైరల్ అవుతున్న ఫోటో..

Swathi

Swathi

మెగా హీరో సాయి ధరమ్ తేజ్, హీరోయిన్ కలర్ స్వాతి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. వీరిద్దరు హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించారు.. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ఒక సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.. అయితే తాజాగా జరిగిన ఓ ఈవెంట్‌లో తమ బాండింగ్ గురించి చెబుతూనే ఎవరికీ తెలియని ఓ విషయాన్ని బయటపెట్టారు. ఇప్పుడు ఇది ఆసక్తి కలిగిస్తోంది.

కలర్స్ టాక్ షోతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన స్వాతి.. ‘అష్టాచమ్మా’ సినిమాతో హీరోయిన్ అయిపోయింది. కొన్నాళ్ల పాటు పలు చిత్రాలు చేసింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని, నటనకు కాస్త బ్రేక్ ఇచ్చింది. కొన్నాళ్ల ముందే రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టేసింది. ఈమె హీరోయిన్‌గా నటించిన ‘మంత్ ఆఫ్ మధు’ మూవీ అక్టోబరు 6న విడుదల కాబోతుంది.. ఈ సందర్భంగా ట్రైలర్ వేడుకని మంగళవారం నిర్వహించారు. దీనికి గెస్ట్‌గా వచ్చిన మెగాహీరో సాయితేజ్.. స్వాతి గురించి పలు విషయాలు రివీల్ చేశాడు..

స్వాతి, తేజు ఇద్దరు క్లాస్ మేట్స్ అని క్లారిటి ఇచ్చారు..ఈ మూవీ స్వాతికి మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్త్ స్వాతి’ అని సాయిధరమ్ తేజ్ చెప్పాడు. ఆ వెంటనే ఇతడిని హగ్ చేసుకున‍్న స్వాతి బుగ్గపై ముద్దుపెట్టింది. అనంతం స్వాతి మాట్లాడుతూ..మేం ఇద్దరం కలిసి చదువుకున్నాం. సినిమాల్లోకి నేను ముందే వచ్చేశాను కాబట్టి తనకంటే పెద్దదాన్ని అని మీరందరూ అనుకుంటున్నారేమో. కానీ మా ఇద్దరికీ ఒకే ఏజ్.. ఒకే కాలేజీలో డిగ్రీ చేశాం. ఎగ్జామ్స్ లో నేను చూపిస్తేనే పాసయ్యాడు.. నాకు మంచి సపోర్ట్ అని చెప్పుకొచ్చింది.. ఏది ఏమైనా స్వాతి ముద్దు పెట్టిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. ఇక నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు..