ప్రతి ఏడాది నాలుగేళ్లకు ఒకసారి నిర్వహించే ఒలింపిక్స్ గేమ్స్‌కు ఎంతటి ప్రాముఖ్యత ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ గేమ్స్‌లో పాల్గొని పతకం సాధించాలని క్రీడాకారులు ఉవ్విళ్లూరుతుంటారు. కరోనా సమయంలో సవాళ్లను ఎదుర్కొని జపాన్ టోక్యో ఒలింపిక్స్‌ను విజయవంతంగా నిర్వహించింది. 17 రోజులపాటు సాగిన ఈ గేమ్స్‌లో 200 దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఇక ఇదిలా ఉంటే, భూమిపై టోక్యోలో ఒలింపిక్స్ గేమ్స్ నిర్వహిస్తే, స్పేస్‌లో వ్యోమగాములు స్పేస్ ఒలింపిక్స్‌ను నిర్వహించారు. వ్యోమగాములు రెండు జట్లుగా విడిపోయి నో హ్యాండ్‌బాల్ గేమ్‌ను ఆడారు. ఆద్యంతం అధ్బుతంగా ఈ క్రీడలు జరిగాయి. ఈ క్రీడల అనంతరం జపాన్ వ్యోమగామి అకిహికో హోషైడ్ 2024 ఒలింపిక్స్ జెండాను ఫ్రాన్స్ వ్యోమగామి థామస్‌కు అందించారు. స్పేస్ ఒలింపిక్స్‌లో సింక్రనైజ్డ్ ఫ్లోటింగ్, వెయిట్‌లెస్ షార్ప్ షూటింగ్, నో హ్యాండ్‌బాల్ తదితర పోటీలను నిర్వహించారు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
Read: సినీ ప్రముఖులు, ప్రభుత్వ అధికారులతో తలసాని కీలక సమావేశం
