ఇళయ తలపతి విజయ్ నామస్మరణతో ఈరోజు ట్విట్టర్ మారుమ్రోగిపోతోంది. నేడు ఈ స్టార్ హీరో 47వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులతో సునామీ సృష్టిస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట్లో #HBDThalapathy, #HBDVijay, #HBDThalapathyVijay వంటి హ్యాష్‌ట్యాగ్ లు రచ్చ చేస్తున్నాయి. తమ అభిమాన నటుడికి పుట్టినరోజు శుభాకంక్షాలు చెబుతూ ఆ హ్యాష్ ట్యాగ్ లను ట్రెండ్ చేస్తున్నారు. అయితే కేవలం అభిమానులు మాత్రమే కాకుండా సెలెబ్రిటీల నుంచి కూడా విజయ్ కు బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి.
Read Also : ‘బాల గాన గాంధర్వులు’ కార్యక్రమం ద్వారా బాలుకు సంగీత నివాళి !
ఇక ఇటీవలే “మాస్టర్” చిత్రంతో ప్రేక్షకులను అలరించిన విజయ్ ప్రస్తుతం “తలపతి65” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న మూవీలో నటిస్తున్నారు. విజయ్ బర్త్ డేను పురస్కరించుకుని నిన్ననే ఈ మూవీ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ “విజయ్65” టైటిల్ ను “బీస్ట్”గా ప్రకటిస్తూ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. త్వరలోనే విజయ్ టాలీవుడ్ అరంగ్రేటం చేయనున్న విషయం తెలిసిందే. కాగా విజయ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేసిన సెలెబ్రెటీల్లో సౌత్ స్టార్స్ అంతా ఉండడం విశేషం.
