స్టార్ హీరోయిన్ ఒకరు తాజాగా దెయ్యంలా మారిపోయి కొరియోగ్రాఫర్ ను భయపెట్టేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. దెయ్యంలా మారిన ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు శిల్పాశెట్టి. ఈ బ్యూటీ దెయ్యంలా భయంకరంగా మేకప్ అయ్యి, వైభవ్ అనే కొరియోగ్రాఫర్ ను భయపెట్టేసింది. ఆమె చిలిపిగా చేసిన ఈ పనిపై నెటిజన్లు కూడా ఫన్నీగా స్పందిస్తున్నారు. ఆమె లుక్ చూసిన వైభవ్ ముందుగా నిజంగానే భయపడిపోయాడు. ఆ తరువాత తేలికపడి నవ్వేశాడు. ఈ తతంగమంతా “సూపర్ డాన్సర్-4” అనే షో సెట్స్ లో జరిగింది. అక్కడే ఉన్న షో జడ్జీలు ఇదంతా చూసి నవ్వాపుకోలేకపోయారు.
Read Also : భార్యతో కలిసి యష్ గృహ ప్రవేశం… పిక్స్ వైరల్
ఇక ఈ వీడియోపై స్పందించిన అదా శర్మ “అది నేను కాదు” అంటూ కామెంట్ చేసింది. అదా ‘1920’ అనే హారర్ మూవీలో నటించిన విషయం తెలిసిందే. కాగా శిల్పాశెట్టి దాదాపు ఒక దశాబ్దం తర్వాత ‘హంగామా 2’ చిత్రంతో బాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది. ఇందులో మీజాన్ పరేష్ రావల్ కూడా నటించారు. నిన్న ఈ చిత్రం నుంచి విడుదలైన “హంగామా-2” ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ చిత్రం మాత్రమే కాకుండా అభిమన్యు దస్సాని, షిర్లీ సెటియాతో కలిసి ఆమె ‘నికమ్మ’లో కూడా కనిపించనుంది.
