Site icon NTV Telugu

బన్నీకి సర్ప్రైజ్… 160 ఏళ్ల పురాతన బహుమతి

Allu Arjun, UAE, 160 year old pistol, Riyaz Kilton, Pushpa,

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు టాలీవుడ్ లో భారీ సంఖ్యలో అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ఒక్క టాలీవుడ్లోనే కాకుండా కోలీవుడ్లోనూ ముఖ్యంగా కేరళలో అల్లు అర్జున్ కు విశేష సంఖ్యలో అభిమానులు ఉన్నారు. మరే టాలీవుడ్ హీరోకూ అక్కడ అంత క్రేజ్ లేదనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో తెలుగు, తమిళంలోనే కాకుండా బాలీవుడ్ లోనూ బన్నీ ఫ్యాన్స్ ను సంపాదించుకుని పాన్ ఇండియా స్టార్ గా మారడానికి సిద్ధంగా ఉన్నాడు. తాజాగా యూఏఈ కి వెళ్లిన అల్లు అర్జున్ కు ఘన స్వాగతం లభించింది. పైగా ఆయనకు ఓ మల్టీ మిలియనీర్ అత్యంత పురాతనమైన బహుమానాన్ని ఇవ్వడం విశేషం.

Read Also : రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన సమంత

కేరళ మూలాలు ఉండి దుబాయ్ లో సెటిలైన మల్టీ మిలియనీర్ రియాజ్ కిల్టన్ యూఏఈలో అల్లు అర్జున్ ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అల్లు అర్జున్ కు 160 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన పిస్టల్ ను బహుమానంగా ఇచ్చి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ విషయాన్ని ప్రముఖ తమిళ దర్శకుడు ఒమర్ లులు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

Exit mobile version