కన్నడ హీరో రిషబ్ శెట్టి పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. గత ఏడాది విడుదల సెన్సేషన్ హిట్ ను అందుకున్న బ్లాక్ బాస్టర్ మూవీ కాంతార తో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.. తక్కువ బడ్జెట్ లో తెరకెక్కి ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలయింది. కానీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద చేసిన రచ్చ మాత్రం అంతా ఇంతా కాదు.. ఆ సినిమాను ఇప్పటికి జనాలు చూస్తున్నారు అంటే సినిమా క్రేజ్ ఇంకా తగ్గలేదని అర్థమవుతుంది..
కర్ణాటకలోని తుళు సంస్కృతిని ప్రతిబింబించేలా హీరో రిషబ్ శెట్టి ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. కాంతార చిత్రానికి, రిషబ్ శెట్టికి అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు దక్కుతున్నాయి. చిన్న సినిమాతో రిషబ్ శెట్టి పాన్ ఇండియా హీరో స్టేటస్ కొట్టేశాడు. అన్ని భాషల్లో ఈ చిత్రం 300 కోట్లకి పైగా వసూళ్లు సాధించింది.. మొత్తంగా చూసుకుంటే సినిమా భారీ కలెక్షన్స్ ను రాబట్టింది.. ఇప్పుడు ఈ సినిమాకు ప్రీక్వెల్ సినిమా ను రిషబ్ శెట్టి తెరకేక్కించే పనిలో ఉన్నారు.. అయితే ఈ హీరో గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది..
ఈ హీరో తన స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలని దత్తత తీసుకున్నట్లు తెలుస్తోంది. రిషబ్ శెట్టి ఈ ఏడాది చారిటి ట్రస్ట్ కూడా ప్రారంభించారు. తన ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆదివారం రోజు రిషబ్ శెట్టి కెరటిలో పాఠశాలని సందర్శించాడు. పాఠశాలని దత్తత తీసుకోవడం పై రిషబ్ ఉపాధ్యాయులతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. తన సొంత ఊరికి ఏదోకటి చెయ్యాలనే కోరిక ఉండేదని ఆ రుణాన్ని ఇప్పుడు తీర్చుకున్నాడని ఆ ఊరి పెద్దలు అభినందించారు..