Site icon NTV Telugu

“లైగర్” రాకకు అడ్డుపడుతున్న రీజన్ ఇదే !

Reason behind delay in Liger release

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ “లైగర్”. ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ స్పోర్ట్స్ డ్రామా రిలీజ్ డేట్ ను ఇంకా ప్రకటించలేదు. ఈ విషయమై విజయ్ దేవరకొండ అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కూడా కరోనా కారణంగా ఇబ్బందుల పాలైంది. కొన్ని రోజులు షూటింగ్ నిలిచిపోయింది. అయితే తాజాగా ఈ సినిమా విడుదలలో ఎందుకు జాప్యం జరుగుతోంది ? ఇంకా సినిమా రిలీజ్ డేట్ ను ఎందుకు ప్రకటించలేదు ? వంటి విషయాలపై క్లారిటీ ఇచ్చారు విజయ్ దేవరకొండ.

Read Also : అఫిషియల్ : “ప్రభాస్ 25” టైటిల్ అనౌన్స్మెంట్

బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కూడా “లైగర్” సినిమాలో భాగమేనని మేకర్స్ ఇప్పటికే ధృవీకరించారు. ఈ సినిమా విడుదల ఆలస్యం కావడానికి ఆయనే కారణమట. ఈ సినిమా ప్రస్తుతం చివరి దశ షూటింగ్ లో ఉందని, దానికోసం యుఎస్‌లో రెండు వారాల సుదీర్ఘ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారట. ఈ షెడ్యూల్ లో దేవరకొండ ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్‌తో ఫైట్ చేసే సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. అయితే కరోనా కారణంగా వీసా ప్రాసెసింగ్‌లో జాప్యం జరుగుతోందని, మేకర్స్ సినిమా విడుదల విషయంపై అధికారిక ప్రకటన చేయడానికి కొంత సమయం కావాలని చెప్పుకొచ్చాడు. వీసా రాగానే, షూటింగ్ తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ‘లైగర్’ విడుదల తేదీని ప్రకటించనున్నారట. పూరి, ఛార్మీ కౌర్ మరియు కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా, రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో విడుదల కానుంది.

Exit mobile version