NTV Telugu Site icon

Rakul Preet Singh: ఖరీదైన కారును కొన్న రకుల్..ఎన్ని కోట్లో తెలుసా?

Rakul Preeth

Rakul Preeth

టాలివుడ్ లో ఒకప్పుడు ఒకవెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది.. కేరీర్ మొదట్లో వరుస హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఈ అమ్మడు నాగార్జున తో మన్మధుడు 2 చేసింది… ఈ సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది.. ఈ సినిమా తర్వాత సినిమాల్లో కనిపించలేదు.. కొంతకాలంగా ఆమెకు అంతగా అవకాశాలు రావడంలేదు. తెలుగులో చివరిసారిగా కొండపొలం చిత్రంలో కనిపించింది రకుల్. ఇటు తెలుగులో దూకుడు తగ్గించిన రకుల్.. హిందీలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తోంది.

గతేడాది అటాక్, రన్ వే 34, కట్ పుట్లి, డాక్టర్ జి వంటి చిత్రాల్లో నటించింది. అలాగే బూ తో ఓటీటీలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా ఉన్న ఈ హీరోయిన్ అయిపొయింది.. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. ఇకపోతే ఈ అమ్మడు తాజాగా లగ్జరీ కారును కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. శుక్రవారంన రకుల్ Mercedes-Benz Maybach GLSని కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఆ కారు ముందు నిలబడి ఫోటోలకు ఫోజులిచ్చింది. అంతేకాకుండా అక్కడున్నవారికి స్వీట్స్ పంచి తన సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకుంది..

రకుల్ కొన్న కారు విలువ దాదాపు రూ.3 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఈ వీడియో నెట్టింట వైరలవుతుండగా.. రకుల్ కు అభినందనలు తెలుపుతున్నారు నెటిజన్స్.. అర్జున్ కపూర్, భూమి ఫెడ్నేకర్ లతో కలిసి మేరే హస్బెండ్ కి బివి చిత్రంలో నటిస్తోంది రకుల్. గతేడాది షూటింగ్ స్టార్ట్ అయిన ఈ రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. అలాగే అజయ్ దేవగన్ నటిస్తోన్న దే దే ప్యార్ దే 2 చిత్రంలోనూ కనిపించనుంది.. ఇక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో చేస్తుంది.. అవి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంటాయి..