కరోనా అంటే చైనా గుర్తుకు వస్తుంది. చైనాలోని వూహన్ నుంచి ఈ వైరస్ మొదలై ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేసింది. రెండేళ్లుగా కరోనాతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. చైనాలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ కారణంగా దాదాపుగా 40 కోట్లకు పైగా పందులు మరణించాయి. దీంతో చైనీయులు మాంసం కోసం అమెరికా, ఆఫ్రికా వంటి దేశాలపై ఆధారపడాల్సి వచ్చింది. దీంతో ఆయా దేశాలు ఈ మాంసం ధరలను భారీగా పెంచేశాయి. పైగా, కరోనా కారణంగా ఎగుమతులపై ఆయా దేశాల్లో ఆంక్షలు ఉండటంతో చైనీయులు ఆహరం కొరత ఏర్పడింది. పైగా చైనాలో ఆర్ధికమాధ్యం నెలకొనడంతో దేశంలోనే ఆరోగ్యకరమైన వాతావరణంలో పందులను పెంచాలని అనుకున్నారు. వెంటనే 13 అంతస్తుల భవనాలను ఏర్పాటు చేశారు. అందులో పటిష్టమైన భద్రత, ఆరోగ్యకరమైన సదుపాయాలు, రకరాలైన వంటలు, ఇక పనులను నిర్వహించడానికి రోబోలను ఏర్పాటు చేశారు. ఏలాంటి సూక్ష్మజీవులు ప్రవేశించడానికి వీలులేకుండా రక్షణాత్మకమైన భవనాల్లో పందులను పెంచుతున్నారు. కార్పోరేట్ సంస్థలు ఈ పందుల పెంపకం రంగంలోకి అడుగుపెట్టి హైటెక్ స్థాయిలో వీటిని పెంచుతున్నారు.
ఆహారం కోసం చైనా అగచాట్లు…అధునాతన భవనాల్లో పందుల పెంపకం…
