Site icon NTV Telugu

మాస్క్ పెట్టుకున్నా… అతడిని అరెస్ట్ చేశారు… ఎందుకంటే…

మాస్క్ లేకుండా బ‌య‌ట‌కు వ‌స్తే భారీ జ‌రిమానాలు విధిస్తున్న సంగ‌తి తెలిసిందే.  అయితే, మాస్క్ పెట్టుకున్న‌ప్ప‌టికీ ఓ వ్య‌క్తికి జ‌రిమానా విధించ‌డంతో పాటుగా జైల్లో పెట్టారు.  అదేంటి మాస్క్ ధ‌రిస్తే జ‌రిమానా వేయ‌డం ఏంటి అనుకుంటున్నారా… అక్క‌డే ఉంది ట్విస్ట్‌.  మామూలు మాస్క్ ధ‌రిస్తే ఎవ‌రూ ప‌ట్టించుకునేవారు కాదు.  కానీ, ఆ వ్య‌క్తి భ‌య‌పెట్టే విధంగా కాస్ట్యూమ్ మాస్క్ ధ‌రించాడు.  భ‌య‌పెట్టే విధంగా ఉన్న మాస్క్ ధ‌రించి దారిన‌పోయే వారిని భ‌య‌పెడుతుండ‌టంతో పోలీసులు అత‌డిని అదుపులోకి తీసుకొని జ‌రిమానా విధించారు.  అంతేకాదు, జైల్లో కూడా పెట్టేశారు.  ఆ సంఘ‌ట‌న పొరుగునున్న పాకిస్తాన్‌లోని పెషావ‌ర్ న‌గ‌రంలో జ‌రిగింది.  దీనికి సంబందించిన విష‌యాల‌ను పాక్ జ‌ర్న‌లిస్ట్ నైలా ఇన్యాత్ సోష‌ల్ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేయ‌డంతో వైర‌ల్‌గా మారింది.  

Read: బన్సాలీకి ‘గంగూభాయ్’ బంపర్ ఆఫర్!

Exit mobile version