Site icon NTV Telugu

వైర‌ల్‌: స‌ముద్రంలో ఉత్త‌రం… ఇద్ద‌రు మ‌నుషుల‌ను ఇలా క‌లిపింది…

37 ఎలేనా అనే మ‌హిళ త‌న కొడుకుతో క‌లిసి ఉత్త‌ర నార్వేలోని గాస్వాయ‌ర్ సముద్రం వ‌ద్ద ప‌డ‌వ‌లో వెళుతుండ‌గా ఆమెకు ఓ బాటిల్ దొరికింది. తొలుత ఆ బాటిల్‌ను ఆమె మ‌ద్యం బాటిల్ అనుకొని తీసుకుంది. అయితే, అందులో లెట‌ర్ క‌నిపించ‌డంతో బాటిల్‌ను ఇంటికి తీసుకెళ్లి జాగ్ర‌త్త‌గా ఒపెన్ చేసింది. అందులోని లెట‌ర్‌ను చూసి ఆశ్చ‌ర్య‌పోయింది. సుమారు పాతికేళ్ల క్రితం 8 సంవ‌త్స‌రాల వ‌య‌సున్న జోహ‌న్నా బచాన్ అనే 8 ఏళ్ల చిన్నారి లెట‌ర్ రాసి దానిని స‌ముద్రంలో ప‌డేసింది. పాతికేళ్ల కాలంలో ఎన్నో మార్పులు జ‌రిగాయి. బ‌చాన్ వ‌య‌సు ప్ర‌స్తుతం 34 ఏళ్లు. ఆస్ట్రేలియాలో డాక్ట‌ర్ గా ప‌నిచేస్తున్న‌ది.

Read: బ‌డ్జెట్‌పై ఆనంద్ మ‌హీంద్రా ఆస‌క్తిక‌ర ట్వీట్‌…

ఆ లెట‌ర్‌ను చ‌దివిన ఎలేనా ఎలాగైనా బచాన్‌ను క‌నుక్కోవాల‌ని అనుకొని సోష‌ల్ మీడియాలో సెర్చ్ చేసింది. అదేరోజు ఎలేనా బ‌చాన్‌ను గుర్తించి ఆమెకు మెసేజ్ చేసింది. కొన్నిరోజుల‌కు బ‌చాన్ నుంచి రిప్లై రావ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఆ లెట‌ర్ అంటే త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని, అందులోని ప్ర‌తి అక్ష‌రం త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని చెప్పుకొచ్చింది. పాతికేళ్ల కాలంలో ఆ బాటిల్ 1200 మైళ్లు ప్ర‌యాణం చేసింది. ప్ర‌స్తుతం ఎలెనా, బ‌చాన్‌లు మంచి స్నేహితులుగా మారిపోయారు.

Exit mobile version