Site icon NTV Telugu

వైర‌ల్‌: పెళ్లికొడుకు చేతిలో చిల్ల‌ర‌…కాళ్ల‌కు దండాలు…

ఈమ‌ధ్య‌కాలంలో పెళ్లిల్లు చాలా వెరైటీగా జ‌రుగుతున్నాయి.  పెళ్లి స‌మ‌యంలో చేసే హంగామా, అనుస‌రించే విధానం కొత్త‌గా ఉంటున్నాయి.  ఆ మ‌ధ్య పెళ్లి కూతురు స‌డెన్ దెయ్యంలాగా క‌నిపించింద‌ని పెళ్లిపీట‌ల మీద‌నుంచి పెళ్లి కొడుకు పారిపోయిన వీడియో వైర‌ల్ అయింది.  అదే విధంగా, పెళ్లి రిసెప్ష‌న్‌లో ఓ వ్య‌క్తి వ‌ధువుకు ముద్దు ఇవ్వ‌డం మ‌రో హైలైట్‌.  ఇలానే ఇప్పుడు ఓ వివాహం రిసెప్ష‌న్ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ది.  రిసెప్ష‌న్ స‌మ‌యంలో నూత‌న వ‌ధూవ‌రులు వేదిక‌పై కూర్చోని ఉండ‌గా, స్నేహితులు వ‌ర‌స‌గా వ‌చ్చి వ‌ధూవ‌రుల చేతిలో చిల్ల‌ర పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు.

Read: చ‌మురు ధ‌ర‌లు భారీగా త‌గ్గ‌నున్నాయా?

ఇలా చేతిలో చిల్ల‌ర పెట్టి ఆశీర్వాదం తీసుకుంటుండ‌గా, పాపం ఆ వ‌ధువు ప‌డిప‌డి న‌వ్వుకుంది.  దీనికి సంబందించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.  జీవితం అల్ల‌రి మ‌యం కాకుండా ఉండాల‌ని అలా చిల్ల‌ర చేతిలో పెడుతున్నార‌ని కొంద‌రు నెటిజ‌న్లు కామెంట్ చేస్తుంటే, వారిలా మాకు త్వ‌ర‌గా పెళ్లి కావాల‌ని కోరుతూ అలా కాళ్ల‌కు దండాలు పెడుతున్నార‌ని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.  

Exit mobile version