Site icon NTV Telugu

ఈ ప‌ర్వ‌తాన్ని అధిరోహించాలంటే… ప్రాణాల‌మీద ఆశ వ‌దిలేసుకోవాల్సిందే…

ప్ర‌యాణాలు చేయ‌డం చాలా మందికి ఆస‌క్తి ఉంటుంది. కొంత‌మంది అడ్వెంచ‌ర్ జ‌ర్నీలు చేస్తుంటారు. అడ్వెంచ‌ర్ జ‌ర్నీలు చేసే వారు ప‌ర్వ‌తాల‌ను అధిరోహించేందుకు అస‌క్తి చూపుతుంటారు. కొన్ని ప‌ర్వ‌తాలు అధిరోహించేందుకు చాలా ఈజీగా ఉంటాయి. కొన్ని మాత్రం ఇబ్బందులు పెడుతుంటాయి. కానీ, పాకిస్తాన్‌లో ఉన్న నంగా ప‌ర్బ‌త్ అనే ప‌ర్వ‌తాన్ని అధిరోహించాలంటే ప్రాణాపై ఆశ‌ను వ‌దిలేసుకోవాల్సిందే. ప్ర‌పంచంలో అత్యంత ఎత్తైన శిఖ‌రాల్లో ఈ నంగా పర్బ‌త్ తొమ్మ‌దోది కాగా, పాక్‌లో రెండో ఎత్తైన శిఖ‌రం. ఈ నంగా ప‌ర్బ‌త్ ప‌ర్వ‌తం పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్‌లోని గిల్గిట్ బాలిస్తాన్‌లో చిలాస్‌, అస్తోర్ ప్రాంతాల మ‌ధ్య ఉన్న ఈ శిఖ‌రం ఎత్తు 26,660 అడుగులు.

Read: నార్త్ కొరియా టార్గెట్ అదే… 2019 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు

1953లో మొదటిసారి ఆస్ట్రియాకు చెందిన హెర్మ‌న్ బుహ్ల్ అనే వ్య‌క్తి అధిరోహించాడు. ఆ త‌రువాత చాలా మంది ఈ నంగా ప‌ర్బ‌త్ ను ఎక్కేందుకు ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మ‌య్యారు. 20 వ శ‌తాబ్దంలో ఈ ప‌ర్వ‌తాన్ని అధిరోహించేందుకు ప్ర‌య‌త్నించి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప‌ర్వ‌తాన్ని అధిరోహించ‌డం చాలా క‌ష్టం. అందుకే దీనిని కిల్ల‌ర్ ప‌ర్వ‌తం అని పిలుస్తారు. ఈ ప‌ర్వ‌తానికి వెళ్లే ప్రాంతంలో అంద‌మైన లొకేష‌న్లు అనేకం ఉన్నాయి. పర్వ‌త సానువుల్లో అంద‌మైన పల్లెటూరులు, ప‌చ్చ‌ని అడ‌వులు క‌నువిందు చేస్తాయి.

Exit mobile version