ఈ ఇంటర్‌నెట్ ప్రపంచంలో కొన్ని డైలాగ్‌లు, మీమ్‌లు తెగ వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు ఇవి బాగా ట్రెండ్ అవుతాయి. ప్రస్తుతం అలాంటి ఓ డైలాగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘సెన్సేషన్’ పేరుతో ఉన్న ఈ డైలాగ్ ను నెటిజన్లు తెగ వీక్షిస్తున్నారు. ఈ డైలాగ్‌కు బాలీవుడ్ ప్రముఖ సంగీత నిర్మాత యశ్‌రాజ్ ముఖతే మ్యూజిక్ యాడ్ చేశారు. ‘మేరీ బాడీ మే సెన్సేషన్ హోతే హై’ అనే డైలాగ్ ఓ హిందీ సినిమాలో హీరోయిన్ పరిణీతి చోప్రా చెప్పింది.
READ MORE: Nidhi Agarwal : నిధి అగర్వాల్ ను ‘వీరమల్లు’ కాపాడుతాడా..?
ఈ మ్యూజిత్‌ను యాడ్ చేసిన ఈ డైలాగ్‌కి పాకిస్థాన్‌కు చెందిన ఒక అమ్మాయి లిప్-సింక్ చేసింది. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఈ క్లిప్ పాకిస్థాన్ కి చెందినది. వీడియోలో నలుపు రంగు దుస్తులు ధరించిన యువతి తన అద్భుతమైన లిప్-సింక్ తో ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఆమె అందం, శైలి, ఆత్మవిశ్వాసం వీడియోలో కనిపించాయి. ఆ అమ్మాయి డైలాగ్ చెబుతూ చాలా అద్భుతంగా నటించిందని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ అమ్మాయి పేరు అలీషా అమీర్ అని తెలుస్తోంది. ఆమె ఓ ఒక టిక్‌టాక్ కంటెంట్ క్రియోటర్.. ఓ లైవ్ షోలో ఆ డైలాగ్‌కి లిప్ సింక్ చేసి ఒక్కసారిగా వైరల్ అయ్యింది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఈ వీడియోను షేర్ చేయగా.. 79 మిలియన్లకు పైగా వీవ్స్, 4 మిలియన్స్‌కి పైగా లైక్స్ వచ్చాయి. ఇదిలా ఉండగా.. పహల్గాం ఘటన అనంతరం.. పాక్ కి చెందిన అకౌంట్స్, వెబ్‌సైట్లపై భారత్‌లో బ్యాన్ చేసినప్పటికీ.. ఈ యువతికి చెందిన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఇప్పటికీ కనిపిస్తుండటం గమనార్హం..
