NTV Telugu Site icon

Meenakshi Chaudhary: బంఫర్ ఆఫర్ కొట్టేసిన మీనాక్షి.. ఆ హీరో సినిమాలో ఛాన్స్..

Meenakshi

Meenakshi

మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మొదటి సినిమాతో మంచి టాక్ ను సొంతం చేసుకుంది.. ఆ సినిమాతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు.. సోషల్ మీడియాలో వరుస ఫోటో షూట్ లతో యువతలో ఫాలోయింగ్ పెంచుకుంటుంది.. ప్రస్తుతం వరుస సినిమాలతో తెగ బిజీగా ఉంది.. ఇప్పటికే చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న ఆమె మరో అవకాశం అందుకుందని తెలుస్తోంది..

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌తో ఆడిపాడనుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విజయ్‌ హీరోగా దర్శకుడు వెంకట్‌ ప్రభు ఓ చిత్రం తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. తలపతి 68′ అనేది వర్కింగ్‌ టైటిల్‌. ఈ సినిమాలోనే మీనాక్షి హీరోయిన్‌గా ఎంపికైందంటూ కోలీవుడ్‌ మీడియాలో వార్తలొస్తున్నాయి.. విజయ్ అభిమానులు ఈ విషయం పై సోషల్ మీడియాలి పెద్ద ఎత్తున చర్చలు సాగిస్తున్నారు.. విజయ్‌ తన అభిమాన నటుడని మీనాక్షి గతంలో చెప్పగా సంబంధిత క్లిప్పింగ్స్‌ను ఆమె అభిమానులు పోస్ట్‌ చేస్తున్నారు.. దాంతో ఆమె పేరు ట్రెండ్ అవుతుంది..

ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి.. మహేష్ బాబు గుంటూరు కారం, హీరో దుల్కర్‌ సల్మాన్‌ – డైరెక్టర్‌ వెంకీ అట్లూరి కాంబోలో రూపొందుతున్న ‘లక్కీ భాస్కర్‌’, వరుణ్‌ తేజ్‌ కరుణ కుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘మట్కా’, విశ్వక్‌ సేన్‌ హీరోగా కొత్త దర్శకుడు రవితేజ ముళ్లపూడి తెరకెక్కిస్తున్న చిత్రంలో మీనాక్షినే హీరోయిన్‌. ఇప్పటికే ఆమె కోలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. విజయ్‌ ఆంటోనీ సరసన ‘కొలై’లో నటించింది. ఈ ఏడాది జులైలో ఆ చిత్రం విడుదలైంది… ఇక విజయ్ లియో సినిమాలో నటిస్తున్నాడు.. ఆ తర్వాత ప్రభు సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ళానున్నారు..

Show comments