NTV Telugu Site icon

Mangalavaram: గణ గణ మోగాలిరా.. పూనకాలు తెప్పిస్తున్న మంగళవారం సాంగ్..

Mangalavaaram First Song Ganagana Mogalira

Mangalavaaram First Song Ganagana Mogalira

తెలుగులో రొమాంటిక్ హిట్ గా నిలిచిన సినిమా ఆరెక్స్ 100 ఫెమ్ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ మంగళవారం.. హారర్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో కనిపించనుంది.. ఆరెక్స్ 100 తప్ప మరో సినిమా హిట్ టాక్ ను అందుకోలేదు.. దాంతో పాయల్ సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. హాట్ అందాలతో సెగలు పుట్టిస్తుంది.. ఆమె ఫోటోల కోసం యూత్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఈ సినిమాలో పాయల్ పాత్ర జనాలను ఆకట్టుకుంటుంది..

పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ అండ్ గ్లింప్స్ కు ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు సినిమాపై అంచనాలు కూడా పెంచేశాయి.. ఈ సినిమా పై సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది.. ఇక మంగళవారం నుండి ఫస్ట్ సింగల్ ను ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్.. ఆ ప్రోమో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది..

ఇప్పుడు తాజాగా గణ గణ మోగాలిరా ఫుల్ సాంగ్ ను విడుదల చేశారు.. కాంతార, విరూపాక్ష సినిమాలకు అద్భుతమైన పాటలతో.. అదిరిపోయే రీ రికార్డింగ్ అందించిన అజనీష్ లోక్ నాధ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించడం విశేషం. మరోసారి తన మ్యూజిక్ లోని మ్యాజిక్ ను ఆడియన్స్ కు రుచిచూపించడానికి సిద్దమయ్యాడు అంజనీష్. మరి మహాసముద్రం సినిమాతో బిగెస్ట్ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్న అజయ్ భూపతి.. ఈ సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.. మంగళవారం సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతాడా అనేది చూడాలి..