సింహం బోనులో ఉన్నా, బయట ఉన్నా దానితో చాలా జాగ్రత్తగా ఉండాలి. సైలెంట్‌గా ఉందని ఆటలాడాలని చూస్తూ ఇదిలో ఇలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. బోనులో ఉన్న సింహం దగ్గరకు ఓ యువకుడు వెళ్లి నిలబడ్డాడు. అయితే, ఆ సింహం తన దగ్గరకు రావోద్దు అన్నట్టుగా గర్జించింది. కానీ, ఆ యువకుడు వినలేదు, పైగా పరాచకాలు ఆడటం మొదులుపెట్టాడు. సింహం సైలెంట్‌గా ఉండటంతో, మెల్లిగా చేతిని బోనులోపలికి పెట్టి తల నిమరాలని చూశాడు. అదే అదునుగా భావించిన సింహం యువకుడి చేతిని నోటితో గట్టిగా పట్టేసింది. విడిపించుకునేందుకు యువకుడు చాలా ప్రయత్నం చేశాడు. అయితే, అక్కడే ఉన్న వ్యక్తులు పెద్దగా కేకలు వేయడంతో ఆ సింహం విడిచిపెట్టింది. లేదంటే ఆ యువకుడు చేతిని కోల్పోవాల్సి వచ్చేది.
సింహం బోనులోనే ఉందని… ఆ యువకుడు…
